China: అమెరికా లక్ష్యాలను ఛేదించేందుకు సాధన ఇలా..!

చైనా సైన్యం అమెరికా విమాన వాహక నౌకలు, ఇతర నావికాదళ నౌకలను లక్ష్యంగా చేసుకోవడాన్ని సాధాన చేస్తోంది. దీనికి షింజియాంగ్‌ ప్రావిన్స్‌లోని ఎడారిలో

Published : 08 Nov 2021 15:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా విమాన వాహక నౌకలు, ఇతర నావికాదళ నౌకలను లక్ష్యంగా చేసుకోవడానికి చైనా సైన్యం సాధాన చేస్తోంది. ఇందు కోసం షింజియాంగ్‌ ప్రావిన్స్‌లోని ఎడారిలో అచ్చం అమెరికా విమాన వాహక నౌకల వంటి నిర్మాణాలను చేపట్టింది. ఈ విషయం మాక్సర్‌ అనే సంస్థ తీసిన ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. తమ యాంటీ క్యారియర్‌ సామర్థ్యాలను ప్రదర్శించేందుకు చైనా ఇలా చేస్తోందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. దక్షిణ చైనా సముద్రంలో అమెరికాతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ చిత్రాలు బయటకు రావడం విశేషం.

తక్లమాకన్‌ ఎడారిలో సరికొత్తగా ఏర్పాటు చేసిన టార్గెట్‌ రేంజ్‌ కాంప్లెక్స్‌ వద్ద అమెరికాకు చెందిన రెండు గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్ల నమూనాలను ఉంచారు. ఈ కాంప్లెక్స్‌ను బాలిస్టిక్‌ మిసైల్‌ పరీక్షలకు వినియోగిస్తున్నారని అమెరికా నేవల్‌ ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంది. చైనాలోని క్షిపణి ప్రోగ్రాంను పీఎల్‌ఏ రాకెట్‌ ఫోర్స్‌ పర్యవేక్షిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు