Chennai Rains: ఆమె కృషి ఫలించలేదు.. ప్రాణాలు దక్కలేదు

తమిళనాడు చెన్నైలోని టీ పీ సత్రం ప్రాంతంలో బుధవారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిన వేళ...  మహిళా పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరి తెగువ ప్రదర్శించిన తీరు తెలిసిందే. సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె.

Published : 14 Nov 2021 01:15 IST

ఆసుప్రతిలో చికిత్స పొందుతూ మరణించిన యువకుడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళనాడు రాజధాని చెన్నైలో కురుస్తోన్న భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఓ మహిళా పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రదర్శించిన తెగువ అందరినీ కదిలించింది. సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరి.. అనారోగ్యంతో శ్మశాన వాటిక వద్ద అపస్మారక స్థితిలో ఉన్న ఉదయ్ కుమార్ అనే 25ఏళ్ల యువకుడిని తన భుజాలపై మోసి ఆసుపత్రికి తరలించారు. కాగా శుక్రవారం ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

ఉదయ్‌ను కాపాడేందుకు ఆమె చేసిన ప్రయత్నం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తొలుత కారులోకి ఎక్కించేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దీంతో బాధితుడిని భుజాలపై మోసి అక్కడ నుంచే ఎదురుగా వస్తున్న ఆటో దగ్గరకు తీసుకెళ్లి ఆటో ఎక్కించారు. విపత్తులో ఆమె ప్రదర్శించిన తెగువకు "సెల్యూట్ మేడం" అంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. విధినిర్వహణలో రాజేశ్వరి చేసిన పనికి ఉన్నతాధికారులు అభినందించారు. తమిళనాడు సీఎం ఎం.కె స్టాలిన్‌ సైతం ఆమె సేవను శుక్రవారం అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గోల్డెన్‌ అవర్‌లో తీసుకొచ్చి కాపాడే ప్రయత్నం చేశారని కొనియాడారు. దురదృష్టవశాత్తూ కాపాడిన వ్యక్తి మరణించడంతో రాజేశ్వరి తీవ్ర ఆవేదనకు గురయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని