భారత నావికాదళానికి కొత్త శక్తి

ఇప్పటివరకూ అమెరికా డ్రోన్లను లీజుకు తీసుకొని వినియోగించుకున్న భారత నావికాదళానికి 10 నూతన డ్రోన్లను కొనేందుకు కేంద్రం అంగీకరించింది.

Published : 01 Jan 2021 21:14 IST

10 డ్రోన్లను కొనేందుకు అంగీకరించిన కేంద్రం

దిల్లీ: ఇప్పటివరకూ అమెరికా డ్రోన్లను లీజుకు తీసుకొని వినియోగించుకున్న భారత నావికాదళానికి 10 నూతన డ్రోన్లను కొనేందుకు కేంద్రం అంగీకరించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన నిఘా సామర్థ్యాలను విస్తరించేందుకు నావికా దళానికి ఈ డ్రోన్లు ఎంతగానో ఉపకరిస్తాయి. ‘‘భారత నావికాదళ అభ్యర్థన రక్షణ మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. ఈ మానవ రహిత వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రూ.1,300 కోట్లు వెచ్చిస్తోంది’’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బై గ్లోబల్ కేటగిరీ కింద నేవీ ఓపెన్‌ బిడ్‌ ద్వారా ఈ డ్రోన్లను కొనుగోలు చేయనుంది. ‘‘వీటిని సముద్రజాలల్లో నిఘా కోసం వినియోగిస్తారు. ముఖ్యంగా చైనీయుల కార్యకలాపాలతో పాటు ఇతరుల కదలికలు గుర్తించడంలో సహకరిస్తాయి’’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి..

యూపీఐ చెల్లింపులకు రుసుముల్లేవ్‌..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని