ఉగ్రవాద నిరోధక చర్యలకు అది అడ్డు కాదు

భారత్‌-పాక్‌ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం కారణంగా ఉగ్రవాద నిరోధకచర్యలకు ఎటువంటి ఆటకం ఉండబోదని ఆర్మీ ఉత్తర లెఫ్టినెంట్‌ జనరల్‌ వైకే జోషి తెలిపారు. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్ ప్రాంతాల్లోని భద్రతను పర్యవేక్షించే నార్త్‌ కమాండ్‌లో శనివారం జరిగిన ఓ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

Published : 28 Feb 2021 01:04 IST

ఆర్మీ ఉత్తర లెఫ్టినెంట్‌ జనరల్‌ వైకే జోషి

ఉధంపూర్‌: భారత్‌-పాక్‌ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం కారణంగా ఉగ్రవాద నిరోధక చర్యలకు ఎటువంటి ఆటకం ఉండబోదని ఆర్మీ ఉత్తర లెఫ్టినెంట్‌ జనరల్‌ వైకే జోషి తెలిపారు. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్ ప్రాంతాల్లోని భద్రతను పర్యవేక్షించే నార్త్‌ కమాండ్‌లో శనివారం జరిగిన ఓ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘‘తాజాగా భారత్‌, పాకిస్థాన్‌ డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్ విభాగాలు నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించాయి. ఈ కాల్పుల విరమణ ఒప్పందం తీవ్రవాద నిరోధక చర్యలపై ఎటువంటి ప్రభావాన్ని చూపదని భరోసానిస్తున్నాను’’ అని జనరల్‌ వైకే జోషి తెలిపారు.

భారత ఆర్మీ పొరుగు దేశాలపై (పాకిస్థాన్‌, చైనా పేర్లను ప్రస్తావించకుండా) తన ఆధిక్యాన్ని ప్రదర్శించి సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పుతుందని ఆయన పేర్కొన్నారు. పొరుగునున్న శత్రు దేశాలు అవాంతరాలను వ్యాప్తి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను నార్త్‌ కమాండ్‌ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతుందన్నారు. మన దేశానికి చెడు తలపెట్టాలని ఎవరు ప్రయత్నించినా సైన్యం గట్టి సమాధానమిచ్చిందని తెలిపారు. కశ్మీర్‌లో ప్రస్తుతం శాంతియుత వాతావరణం నెలకొందని, ఉగ్రవాద కార్యకలాపాలు చాలా వరకు తగ్గాయని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని