బాధ్యతల నుంచి వైదొలగిన రౌల్‌ క్యాస్ట్రో

క్యూబా రాజకీయాలను ఆరు దశాబ్దాలుగా శాసిస్తున్న క్యాస్ట్రో శకం ముగియనుంది. క్యూబన్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రథమ కార్యదర్శి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు రౌల్‌ క్యాస్ట్రో (89) ప్రకటించారు. ఆ పార్టీ 8వ సదస్సు ప్రారంభోపన్యాసంలో ప్రసంగిస్తూ....

Published : 17 Apr 2021 20:31 IST

క్యూబా రాజకీయాల్లో ముగియనున్న క్యాస్ట్రో శకం

హవానా: క్యూబా రాజకీయాలను ఆరు దశాబ్దాలుగా శాసిస్తున్న క్యాస్ట్రో శకం ముగియనుంది. క్యూబన్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రథమ కార్యదర్శి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు రౌల్‌ క్యాస్ట్రో (89) ప్రకటించారు. ఆ పార్టీ 8వ సదస్సు ప్రారంభోపన్యాసంలో ప్రసంగిస్తూ తను పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో క్యూబా రాజకీయాల్లో క్యాస్ట్రో శకం ముగిసిపోనుంది. ఇన్నాళ్లపాటు నిర్వహించిన విధుల గురించి సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. క్యూబా భవిష్యత్తు బాగుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధిలో యువతరం కీలక పాత్ర పోషిస్తుందని, పార్టీ బాధ్యతలను యువతరానికి అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కానీ తన వారసుడు ఎవరనేది మాత్రం ఆయన ప్రకటించలేదు.  

2016లో సోదరుడు ఫిడేల్‌ క్యాస్ట్రో మృతి అనంతరం రౌల్‌ క్యాస్ట్రో కమ్యూనిస్టు పార్టీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి ఐదేళ్లపాటు తన బాధ్యతలు నిర్వర్తించారు. కాగా ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు మిగుయేల్‌ డియాజ్‌ కానెల్‌ (60) తదుపరి ప్రథమ కార్యదర్శిగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. క్యూబాకు అధ్యక్షుడు ఉన్నప్పటికీ.. రాజకీయంగా క్యూబన్‌ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిదే ఆధిపత్యం ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని