Viral Video: వంట పాత్రలో నూతన వధూవరులు

కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్న వేళ అక్కడ జరిగిన ఓ పెళ్లి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పెళ్లికి వేదికైన ఆలయం నీట మునగడంతో.. సమీపంలోని కల్యాణ మండపానికి వంట పాత్రలో

Updated : 18 Oct 2021 20:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్న వేళ అక్కడ జరిగిన ఓ పెళ్లి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పెళ్లికి వేదికైన ఆలయం నీట మునగడంతో.. సమీపంలోని కల్యాణ మండపానికి వంట పాత్రలో బయలుదేరాల్సిన విచిత్రమైన అనుభవం ఓ జంటకు ఎదురైంది. చెంగనూరులోని ఓ ఆసుపత్రిలో ఆరోగ్య కార్యకర్తలుగా పని చేస్తున్న ఆకాశ్‌, ఐశ్వర్య అనే జంట.. తలవాడిలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ ప్రాంతమంతా నీట మునగడంతో సమీపంలోని కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలని భావించారు. అయితే అక్కడికి వెళ్లే దారిలోనూ నీరు నిలిచి ఉండటంతో పెళ్లి కోసం తెచ్చిన వంట పాత్రలో కూర్చొని వివాహ వేదికకు బయలుదేరారు. బంధువులు ఆ పాత్రను తోసి వారిని కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం ఇరువురూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. భారీ వర్షాలు అడ్డంకిగా మారినా.. పెళ్లి కార్యక్రమం సజావుగా ముగియడంతో వధూవరుల బంధువులు సంతోషించారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని