Covaxin: కొవాగ్జిన్‌ దిగుమతికి బ్రెజిల్‌ పచ్చజెండా

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌తో పాటు రష్యన్ టీకా స్పుత్నిక్ -వి దిగుమతికి బ్రెజిల్ పచ్చజెండా ఊపింది. మొదట్లో హైదరాబాద్‌లోని కొవాగ్జిన్ తయారీ ప్లాంట్‌పై....

Published : 05 Jun 2021 23:45 IST

బ్రెసీలియా: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌తో పాటు రష్యన్ టీకా స్పుత్నిక్ -వి దిగుమతికి బ్రెజిల్ పచ్చజెండా ఊపింది. బ్రెజిల్ జాతీయ ఆరోగ్య సంస్థ అన్విసా  ఆమోదంతో బ్రెజిల్‌కు 40 లక్షల కొవాగ్జిన్ డోసుల ఎగుమతికి అడ్డంకులు తొలగిపోయాయి. వీటి వినియోగం అనంతరం ఫలితాలను పూర్తిగా అధ్యయనం చేసుకొని మున్ముందు ఆర్డర్లపై బ్రెజిల్‌ నిర్ణయం తీసుకోనుంది. 

భారత్ బయోటెక్ ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్రెజిల్‌తో ఒప్పందంపై ప్రకటన చేసింది. ఈ ఏడాది రెండు, మూడో త్రైమాసికాల్లో దాదాపు 2 కోట్ల కొవాగ్జిన్‌ డోసులను ఆ దేశానికి సరఫరా చేయనున్నట్లు తెలిపింది. అన్విసా గత ఏప్రిల్‌లో రష్యా రూపొందించిన స్పుత్నిక్‌-వి పైనా అనుమానం వ్యక్తం చేసింది. టీకా భద్రత, నాణ్యతతోపాటు  దాని ప్రభావాన్ని సూచించే కచ్చితమైన డేటా లేదని స్పుత్నిక్-వి దిగుమతిని నిరాకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని