PICS: బీరుట్‌ బ్లాస్ట్‌ తర్వాత... 

లెబనాన్‌ రాజధాని బీరుట్‌ హృదయవిదారకంగా మారింది. భారీ పేలుళ్లతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి..

Updated : 05 Aug 2020 17:27 IST

బీరుట్‌: లెబనాన్‌ రాజధాని బీరుట్‌ హృదయవిదారకంగా మారింది. భారీ పేలుళ్లతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో దాదాపు 100 మంది మృతి చెందారు. నాలుగు వేల మంది గాయపడ్డారు. బీరుట్‌ ఓడరేవు కేంద్రంగా చోటుచేసుకున్న ఈ ఘటనతో నగరంలో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఓడరేవులో టపాసులు నిల్వ చేసిన గోదాములో పేలుడు సంభవించినట్లు స్థానిక ప్రసార మాధ్యమాలు తెలిపాయి. కాగా కొన్ని కిలోమీటర్ల మేర పేలుడు ప్రభావం చూపింది. దీంతో అనేక కట్టడాలు నేలమట్టమయ్యాయి. భారీ ఆస్తి నష్టం జరిగినట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు. 

భారీ పేలుడు ధాటికి నేలమట్టమైన ఓడరేవులోని గోదాం


ధ్వంసమైన కట్టడాలు, పార్కింగ్‌ చేసిన కార్లు


పేలుడు సంభవించిన ప్రాంతంలో హెలికాప్టర్‌తో మంటలార్పుతున్న దృశ్యం


పాక్షికంగా దెబ్బతిన్న ఓ పెట్రోల్‌ బంక్‌


పేలుడు ధాటికి మంటల్లో కాలి బూడిదవుతున్న కట్టడాలు


ఓడరేవు సమీపంలో పూర్తిగా దెబ్బతిన్న నిర్మాణాలు, వాటి పైకప్పులు


భవన శిథిలాలను జేసీబీతో తొలగిస్తున్న దృశ్యం


ఓ భవనం కూలిపోగా అందులో సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది


దెబ్బతిన్న ఓ చర్చి


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని