Afghanistan: అఫ్గాన్‌లో మరో బాంబు దాడి.. ముగ్గురి మృతి!

బాంబు పేలుళ్లతో అఫ్గాన్‌ మరోసారి దద్దరిల్లింది! ఇక్కడి నంగర్‌హార్‌ ప్రావిన్స్‌ స్పిన్‌ఘర్‌ ప్రాంతంలోని ఓ మసీదులో జరిగిన పేలుడులో ముగ్గురు మృతి చెందగా, 15 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. మసీదు ఇమామ్‌కూ గాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు. శుక్రవారం...

Published : 12 Nov 2021 19:32 IST

కాబుల్‌: బాంబు పేలుళ్లతో అఫ్గాన్‌ మరోసారి దద్దరిల్లింది! ఇక్కడి నంగర్‌హార్‌ ప్రావిన్స్‌ స్పిన్‌ఘర్‌ ప్రాంతంలోని ఓ మసీదులో జరిగిన పేలుడులో ముగ్గురు మృతి చెందగా, 15 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. మసీదు ఇమామ్‌కూ గాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ విషయాన్ని తాలిబన్‌ అధికారులు సైతం ధ్రువీకరించారు. మసీదు లోపల పేలుడు పదార్థాలు అమర్చినట్లు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక వైద్యాధికారులు తెలిపారు. మరోవైపు ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ ఘటనకు బాధ్యత వహించలేదు.

ఐఎస్‌ ప్రాబల్య ప్రాంతమిది..

తాలిబన్లు అధికారంలోకి వచ్చాక అఫ్గాన్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. షియాలను లక్ష్యంగా చేసుకుని వారు గతంలోనూ అనేక సార్లు దాడులకు తెగబడ్డారు. పైగా నంగర్‌హార్‌ ప్రావిన్సులో వీరి ప్రాబల్యం ఎక్కువ. ఇటీవల నవంబరు 2న సైతం కాబుల్‌ నగరంలోని మిలిటరీ ఆస్పత్రి వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో దాదాపు 19 మంది మృత్యువాతపడగా మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని