ట్రంప్‌ లేఖ.. గొప్పగా ఉంది: బైడెన్‌ 

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధానికి వీడుతూ తనకు రాసిన లేఖ గొప్పగా ఉందని అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ కొనియాడారు. సంప్రదాయాన్ని పాటిస్తూ ట్రంప్‌ నిన్న ఓవల్‌ ఆఫీస్‌లోని

Published : 21 Jan 2021 13:29 IST

వాషింగ్టన్‌: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధానికి వీడుతూ తనకు రాసిన లేఖ హుందాగా ఉందని అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ కొనియాడారు. సంప్రదాయాన్ని పాటిస్తూ ట్రంప్‌ నిన్న ఓవల్‌ ఆఫీస్‌లోని రిజల్యూట్‌ డెస్క్‌పై బైడెన్‌ను ఉద్దేశించి ఓ లేఖను విడిచిపెట్టి వెళ్లారు. ఈ లేఖపై బైడెన్‌ స్పందిస్తూ.. ‘ట్రంప్‌ చాలా ఉదారమైన, గొప్ప లేఖ రాశారు’ అని అన్నారు. త్వరలోనే ఆయనతో మాట్లాడనున్నట్లు తెలిపారు. 

కొత్త ప్రెసిడెంట్‌కు పాత అధ్యక్షుడు ఇలా సందేశమివ్వడం ఆనవాయితీగా వస్తుంది.  అయితే, అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, నిజమైన గెలుపు తనదేనని చెబుతూ వచ్చిన ట్రంప్‌... అధికార బదిలీకి సంబంధించిన ప్రతి సంప్రదాయానికి అడ్డు తగులుతూ వచ్చారు. చివరికి బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు కాలేదు. కానీ... ఈ లేఖ ఆనవాయితీని మాత్రం ఆయన పాటించడం విశేషం!

అగ్రరాజ్యంలో బుధవారం నూతన ప్రభుత్వం కొలువుదీరింది. 46వ అధ్యక్షుడిగా బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన కొద్దిసేపటికే ఓవల్‌ ఆఫీస్‌కు వెళ్లిన బైడెన్‌.. తొలి రోజే 15 కీలక ఆదేశాలపై సంతకాలు చేశారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకొచ్చిన పలు విధానాలకు స్వస్తి పలికారు. 

ఇవీ చదవండి..

బైడెన్‌.. హారిస్‌ తొలి ట్వీట్లు ఇవే..

కీలక ఆదేశాలపై జో బైడెన్‌ సంతకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని