Crackers Ban: దీపావళి బాణసంచాపై నిషేధం.. దీదీ సర్కార్‌ కీలక నిర్ణయం!

దీపావళి బాణసంచాపై బెంగాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి సహా రాబోయే ఇతర పండుగల్లో టపాసుల విక్రయం, వినియోగంపై నిషేధం విధించింది........

Published : 27 Oct 2021 23:53 IST

కోల్‌కతా (Kolkata): దీపావళి బాణసంచా (Diwali Fire Crakers)పై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం (West Bengal Govt.) కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి (Deepavali) సహా రాబోయే ఇతర పండుగల్లో టపాసుల విక్రయం, వినియోగంపై నిషేధం (Fire Crackers Ban) విధించింది. స్వీయ నిర్బంధంలో ఉన్న కొవిడ్‌ రోగుల ఆరోగ్య పరిస్థితి, రాష్ట్రంలో వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మమతా బెనర్జీ ప్రభుత్వం (Mamata Benarjee Govt.) తెలిపింది. పర్యావరణ హితమైన టపాసులను మాత్రమే వినియోగించేందుకు అనుమతించనున్నట్టు తెలిపింది. అందుకు కూడా రెండు గంటల పాటు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది.

దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10గంటల మధ్య టపాసులు కాల్చేందుకు అనుమతిస్తున్నారు. ఛత్‌ పూజ సందర్భంగా ఉదయం 6 నుంచి 8 గంటల వరకు; క్రిస్మస్‌ రోజున 35 నిమిషాల పాటు; నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అర్ధరాత్రి 11.55 గంటల నుంచి 12.30 వరకు మాత్రమే పర్యావరణహిత టపాసులు కాల్చేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు పశ్చిమ బెంగాల్‌ కాలుష్య నింత్రణ బోర్డు తెలిపింది. బాణసంచా కాల్చడంతో విడుదలయ్యే హానికరమైన రసాయనాలు శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని