Updated : 11/07/2021 22:10 IST

Delhi: పాఠశాలల్లో ఆడిటోరియాన్ని వాడుకోవచ్చు!

దిల్లీ: దేశ రాజధానిలోని పాఠశాలల్లో ఆడిటోరియం, అసెంబ్లీ హాళ్లను వినియోగించుకునేందుకు దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ అనుమతిచ్చింది. అయితే, కేవలం విద్యాపరమైన శిక్షణ, సమావేశాలను మాత్రమే నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. ఈ ఆడిటోరియాల్లో విద్యార్థులకు పాఠాలు బోధించకూడదని తెలిపింది. కరోనా నేపథ్యంలో దిల్లీలో లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తిరిగి సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అన్‌లాక్‌ ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం.. దిల్లీ మెట్రో రైళ్లు, బస్సులు 50శాతం సామర్థ్యంతో నడిపించేందుకు ఇటీవల అనుమతి ఇచ్చింది. తాజాగా పాఠశాలల్లో ఆడిటోరియాలు, అసెంబ్లీ హాళ్లను శిక్షణ, సమావేశాల నిమిత్తం వాడుకోవచ్చని వెల్లడించింది. కాగా.. విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు యథాతథంగా మూసివేసే ఉంటాయని పేర్కొంది. అలాగే.. సినిమాహాళ్లు, మల్టిప్లెక్స్‌, స్పాలు, థియేటర్లు, పార్కులు, ఇతర బహిరంగ సమావేశాలు, వేడుకలపై జులై 26 వరకు నిషేధం కొనసాగుతుందని ప్రకటనలో పేర్కొంది. దిల్లీలో మొత్తం నమోదైన కరోనా కేసులు 14,35,030 కాగా.. ప్రస్తుతం 792 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని