Drugs Case: ప్రభాకర్‌ ఎవరో నాకు తెలియదు: ఆర్యన్‌ ఖాన్‌

బాలీవుడ్‌ను కుదిపేస్తోన్న ముంబయి క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో

Published : 26 Oct 2021 14:15 IST

షారుక్‌ మేనేజర్‌ సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న ఎన్‌సీబీ

ముంబయి: బాలీవుడ్‌ను కుదిపేస్తోన్న ముంబయి క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఆర్యన్‌ను బెయిల్‌ ఇవ్వొద్దని ఎన్‌సీబీ తన అఫిడవిట్‌లో కోరింది. ఇదిలా ఉండగా.. ఈ కేసులో సంచలన ఆరోపణలు చేసిన ప్రత్యక్ష సాక్షి ప్రభాకర్ సాయీల్‌ ఎవరో తనకు తెలియదని ఆర్యన్‌ చెప్పడం గమనార్హం. 

బెయిల్‌ విచారణ సందర్భంగా ఆర్యన్ తరఫున న్యాయవాదులు నేడు బాంబే హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఇందులో నిందితుడి తరఫు నుంచి ఎన్‌సీబీ అధికారులతో ఎలాంటి ఒప్పందం జరగలేదని ఉంది. అంతేగాక, ప్రభాకర్‌ ఎవరో తనకు తెలియదని, ఆయనతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఆర్యన్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ‘‘ఈ కేసులో వస్తోన్న ఆరోపణలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా ఎన్‌సీబీ అధికారులు, రాజకీయ నాయకుల మధ్య విషయం. ఎన్‌సీబీ అధికారులకు వ్యతిరేకంగా నేను ఎలాంటి ఆరోపణలు చేయలేదు’’ అని ఆర్యన్‌ అఫిడవిట్‌లో తెలిపినట్లు సమాచారం.

సాక్షులను ప్రభావితం చేస్తున్నారు: ఎన్‌సీబీ

మరోవైపు ఆర్యన్‌ బెయిల్‌ను ఎన్‌సీబీ వ్యతిరేకిస్తోంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులను షారుక్‌ మేనేజర్‌ పూజా దద్లానీ ప్రభావితం చేస్తున్నట్లు కన్పిస్తోందని, ఇది పూర్తిగా దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు చేసే ప్రయత్నమే అని ఆరోపించింది. ఈ మేరకు బాంబే హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో సాయంత్రం విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. ఆర్యన్‌ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు.

మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్ సమీర్‌ వాంఖడేపై విజిలెన్స్‌ కమిటీ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సమీర్‌ నేడు దిల్లీలోని ఎన్‌సీబీ ప్రధాన కార్యాలయానికి హాజరయ్యారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని