పోలీసులను పరామర్శించిన అమిత్‌ షా!

గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో జరిగిన రైతుల ఆందోళనలో గాయపడిన పోలీసు సిబ్బందిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పరామిర్శించారు.

Published : 28 Jan 2021 22:45 IST

దిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో జరిగిన రైతుల ఆందోళనలో గాయపడిన పోలీసు సిబ్బందిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పరామర్శించారు. నగరంలోని శుశ్రుత్‌ ట్రామా సెంటర్‌తో పాటు తీర్థ్‌ రామ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందన్న ఆయన, ఆందోళన సందర్భంగా దిల్లీ పోలీసులు చూపిన తెగువ, సంయమనం ఎంతో గర్వకారణమని ట్విటర్‌లో పేర్కొన్నారు. అమిత్‌ షాతోపాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌ ఎన్‌ శ్రీవాస్తవ పోలీసు సిబ్బందిని పరామర్శించారు.

జనవరి 26న దిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనల్లో రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారని దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌ ఎన్‌ శ్రీవాస్తవ బుధవారం ఆరోపించిన విషయం తెలిసిందే. వీటికి బాధ్యులైన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో దిల్లీ పోలీసులు రైతు సంఘాల నాయకులపై చర్యలు తీసుకునేందుకు నోటీసులు జారీచేశారు. ఇప్పటికే వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. పలువురు నాయకులపై లుకౌట్‌ నోటీసులు జారీచేశారు. వారి పాస్‌పోర్టులను కూడా వెంటనే పోలీసులకు సరెండర్‌ చేయాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని