ADB Loan: భారత్‌కు ₹11,185 కోట్ల రుణం.. ఏడీబీ ఆమోదం

1.5బిలియన్‌ డాలర్లు (రూ.11,185 కోట్ల) మేర భారత్‌కు రుణం ఇచ్చేందుకు ఏడీబీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్యాంకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Updated : 24 Nov 2022 14:00 IST

దిల్లీ: కరోనా వైరస్‌ కట్టడి కోసం పోరాటం చేస్తున్న భారత్‌కు సహాయం చేసేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ‌(ఏడీబీ) ముందుకొచ్చింది. కరోనా నివారణ టీకాల కొనుగోలుకు భారీగా రుణం మంజూరుచేసేందుకు ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్ల సేకరణకు 1.5బిలియన్‌ డాలర్లు (రూ.11,185 కోట్ల) మేర రుణం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్యాంకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. సమర్థవంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్ల కొనుగోలు కోసం భారత్‌కు 1.5 బిలియన్‌ డాలర్ల మేర రుణం మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు, భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 90.27 లక్షల డోసులు పంపిణీ చేశారు. దేశంలో ఇప్పటిదాకా 119.38 కోట్లకు పైగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ జరిగింది.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని