టీకా తీసుకున్న వైద్యుడిలో ఎన్సెఫలోమైలిటిస్‌!

కొవిడ్‌ నిరోధానికి ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేసిన టీకాను తీసుకున్న ఓ మెక్సికో వైద్యుడిలో దుష్ప్రభావాలు తలెత్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మ సంబంధిత అలర్జీ వంటి లక్షణాలు గుర్తించడంతో వెంటనే ఆస్పత్రిలో............

Published : 03 Jan 2021 10:13 IST

మెక్సికో సిటీ: కొవిడ్‌ నిరోధానికి ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేసిన టీకాను తీసుకున్న ఓ మెక్సికో వైద్యుడిలో దుష్ప్రభావాలు తలెత్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మ సంబంధిత అలర్జీ వంటి లక్షణాలు గుర్తించడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రాథమిక పరీక్షల్లో దీన్ని ఎన్సెఫలోమైలిటిస్‌గా వైద్యులు గుర్తించారు. మెదడు, వెన్నెముకలో తలెత్తే ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల ఎన్సెఫలోమైలిటిస్‌ వస్తుందని తెలిపారు. క్లినికల్‌ దశలో టీకా తీసుకున్న వాలంటీర్లలో ఈ దుష్ప్రభావం తలెత్తలేదని స్పష్టం చేశారు. అయితే, ఆ వైద్యుడికి గతంలో పలు సార్లు అలర్జీలు తలెత్తిన దాఖలాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై ఫైజర్‌గానీ, బయోఎన్‌టెక్‌గానీ స్పందించలేదు. ఇప్పటి వరకు మెక్సికోలో 1,26,500 మంది కొవిడ్‌ బారిన పడి మరణించారు. డిసెంబరు 24 నుంచి అక్కడ టీకా ఇవ్వడం ప్రారంభించారు.

ఇవీ చదవండి..

ప్రపంచాన్ని చుట్టేస్తున్న కొత్త రకం!

తొలి దశలో 3 కోట్ల మందికి ఉచిత టీకా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని