సాగుచట్టాలపై వెనక్కి తగ్గని కేంద్రం!

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్న రైతు సంఘాల నేతలో కేంద్రం నేడు మరోసారి చర్చలు చేపట్టింది. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ నేతృత్వంలో

Updated : 30 Dec 2020 17:38 IST

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్న రైతు సంఘాల నేతలతో కేంద్రం నేడు మరోసారి చర్చలు చేపట్టింది. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ నేతృత్వంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. అయితే రైతుల ప్రధాన డిమాండ్‌ అయిన చట్టాల రద్దు పట్ల కేంద్రం ఇప్పటికీ సుముఖంగా ఉన్నట్లు కన్పించట్లేదు. సాగు చట్టాలను ఉపసంహరించడం కుదరదని కేంద్రం అన్నదాతలకు మరోసారి స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఆందోళన విరమిస్తే కనీస మద్దతు ధర అంశాన్ని పరిశీలిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారంపై ప్రతిష్టంభన తొలుగుతుందో లేదో అన్న సందిగ్ధత నెలకొంది. 

రైతులతో కలిసి మంత్రుల భోజనం

కేంద్రంతో చర్చలు జరిపిన ప్రతిసారి ప్రభుత్వ ఆతిథ్యానికి రైతులు నిరాకరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. సింఘు వద్ద ఏర్పాటు చేసిన లంగర్‌లో వండి తెచ్చిన ఆహారాన్నే రైతులు తిన్నారు. ఇప్పుడు కూడా అలాగే భోజనం తెచ్చుకోగా.. కేంద్ర మంత్రులు కూడా అదే ఆహారాన్ని తిన్నారు. భోజన విరామ సమయంలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌ రైతు సంఘాల ప్రతినిధులతో కలిసి వారి భోజనాన్ని రుచిచూశారు. 

ఇదీ చదవండి..

ప్రతిష్టంభన వీడేనా? 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని