స్వీయ కొవిడ్‌ టెస్ట్‌కిట్‌కు బ్రిటన్‌ అనుమతి

ప్రజలు సొంతంగానే కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేసుకునే టెస్ట్‌కిట్‌కు బ్రిటన్‌ అనుమతి ఇచ్చింది. 

Published : 24 Dec 2020 00:56 IST

లండన్‌: బ్రిటన్‌లో కొత్తరకం వైరస్‌ విజృంభణ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలుచేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు బ్రిటన్‌ మరో నిర్ణయం తీసుకుంది. భారీ స్థాయిలో కొవిడ్‌ టెస్టులను చేయడంలో భాగంగా, ప్రజలు సొంతంగానే కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేసుకునే టెస్ట్‌కిట్‌కు అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా లక్షణాలు లేని కేసులను గుర్తించేందుకు ఇది దోహదపడుతుందని బ్రిటన్‌ ఔషధ నియంత్రణ సంస్థ(ఎంహెచ్‌ఆర్‌ఏ) అభిప్రాయపడింది. యాంటీజెన్‌ లాటెరల్‌ ఫ్లో టెస్ట్‌(యాంటీజెన్‌ ఎల్‌ఎఫ్‌టీ) పరికరం ద్వారా కేవలం 30నిమిషాల్లోనే కొవిడ్‌ ఫలితం వస్తుందని తెలిపింది.

ఇదిలాఉంటే, బ్రిటన్‌లో కొత్తరకం వైరస్‌ బయటపడిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే దాదాపు 40 దేశాలు యూకే నుంచి  విమాన రాకపోకలపై ఆంక్షలు విధించాయి.

ఇవీ చదవండి..
యూకే రిటర్న్స్‌: వారందరినీ ట్రాక్‌ చేస్తాం..!
కొవిడ్‌ ఇమ్యూనిటీ: 8నెలల పాటు యాంటీబాడీలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు