Published : 16/12/2020 14:47 IST

ట్రంప్‌: టీకా తీసుకునేందుకు సిద్ధమే..కానీ..,

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది. ఇప్పటికే ఫైజర్‌ అభివృద్ధి చేసిన టీకాకు అమెరికాలో అత్యవసర వినియోగానికి అనుమతి కూడా లభించింది. అయితే, వ్యాక్సిన్‌పై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకు ప్రముఖులు ముందుగా టీకా తీసుకుంటే మంచిదనే వాదన మొదలయ్యింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాక్సిన్‌ను బహిరంగంగానే తీసుకునేందుకు సిద్ధంగానే ఉన్నట్లు ప్రకటించారు. కానీ, అంతకుముందు ఆరోగ్య సిబ్బంది, వైరస్‌ ప్రమాదం పొంచివున్న వారికి తొలుత ప్రాధాన్యత ఇవ్వాలని ట్రంప్‌ భావిస్తున్నట్లు వైట్‌హౌస్‌ ప్రకటించింది.

‘ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్‌ను బహిరంగంగా తీసుకునేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ సిద్ధంగానే ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే నాతో వ్యక్తిగతంగాను, ప్రజలతో బహిరంగాంగానే స్పష్టంగా పేర్కొన్నారు. కానీ, ఈ మధ్యే కరోనా వైరస్‌ నుంచి ట్రంప్‌ కోలుకున్న విషయం తెలిసిందే. వీటివల్ల వృద్ధిచెందిన యాంటీబాడీలతో అధ్యక్షుడు ఆరోగ్యంగానే ఉన్నారు. ఒకవేళ వైద్య బృందం సిఫార్సు చేస్తే.. ఆ వెంటనే ట్రంప్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటారు’ అని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కెలీగ్‌ మెక్‌ఎనాని మీడియాతో అన్నారు. వీటికంటే ముందు ఆరోగ్యసిబ్బందితో పాటు కరోనా వైరస్‌ ముప్పు పొంచివున్న వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ట్రంప్‌ కోరుకుంటున్నారని తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ను ట్రంప్‌ బహిరంగంగా తీసుకుంటారా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ప్రెస్‌ సెక్రటరీ ఈ విధంగా స్పందించారు.

అమెరికాలో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడితో సహా నూతన అధ్యక్షుడు, మాజీ అధ్యక్షులు వ్యాక్సిన్‌ బహిరంగంగానే తీసుకోవాలనే ప్రచారం ఎక్కువయ్యింది. ఇప్పటికే జో బైడెన్‌తో సహా ఒబామా, బుష్‌ వంటి నేతలు కూడా వ్యాక్సిన్‌ బహిరంగంగానే తీసుకుంటామని ప్రకటించారు.

ఇవీ చదవండి..
కొవిడ్‌ టీకా: పారదర్శకంగా లేని చైనా!
కరోనా టీకా: అమెరికాలో ఆమె, కెనడాలో ఈమె!

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

బిజినెస్

క్రీడలు

పాలిటిక్స్

వెబ్ ప్రత్యేకం

జనరల్