Special Trains: దసరాకు 8 ప్రత్యేక రైళ్లు

దసరా పండుగకు రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 8 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు రైల్వే

Published : 12 Oct 2021 11:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: దసరా పండుగకు రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 8 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. విశాఖపట్నం-సికింద్రాబాద్‌ (నం.08579) 13, 20, 27 తేదీల్లో, సికింద్రాబాద్‌-విశాఖపట్నం (08580) 14, 21, 28, విశాఖపట్నం-తిరుపతి (08583) 18, 25, తిరుపతి-విశాఖపట్నం (08584) 19, 26, విశాఖపట్నం-సికింద్రాబాద్‌ (08585) 19, 26, సికింద్రాబాద్‌-విశాఖపట్నం (08586) 20, 27 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. మరో రెండు రైళ్లు చెన్నై సెంట్రల్‌-సంత్రగచ్చీ మధ్య రాకపోకలు సాగించనున్నాయి.

ఆరు రైళ్ల రద్దు.. మరో 30 దారి మళ్లింపు

సోలాపూర్‌ రైల్వే డివిజన్‌లో పనుల కారణంగా ఆరు రైళ్లను రద్దు చేయడంతోపాటు 30 రైళ్లను దారి మళ్లించనున్నట్లు రైల్వే శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌-హడాప్సర్‌ రైలు ఈ నెల 18, 20, 23, 25, 28 తేదీల్లో, హడాప్సర్‌-హైదరాబాద్‌ రైలు 19, 22, 24, 26, 29 తేదీల్లో రద్దయ్యాయి. విశాఖపట్నం-ముంబయి ఎల్‌టీటీ రైలుని 18 నుంచి 26వ తేదీ వరకు సికింద్రాబాద్, నిజామాబాద్, నాందేడ్, కళ్యాణ్‌ మీదుగా, ముంబయి ఎల్‌టీటీ-విశాఖపట్నం రైలుని 18 నుంచి 28 వరకు కళ్యాణ్, నాందేడ్, నిజామాబాద్, సికింద్రాబాద్‌ మీదుగా దారి మళ్లించనున్నారు. రాజ్‌కోట్‌-సికింద్రాబాద్‌ రైలుని 18, 20, 21, 25, 27 తేదీల్లో పుణే, సోలాపూర్‌ మీదుగా, సికింద్రాబాద్‌-రాజ్‌కోట్‌ రైలుని 16, 18, 19, 23, 25, 26 తేదీల్లో సోలాపూర్, పుణే మీదుగా, కాకినాడ-భావ్‌నగర్‌ టెర్మినల్‌ రైలుని 21న, భావ్‌నగర్‌ టెర్మినల్‌-కాకినాడ రైలును 16, 23 తేదీల్లో పుణే మీదుగా, ఇండోర్‌-లింగంపల్లి రైలును 16, 23 తేదీల్లో, లింగంపల్లి-ఇండోర్‌ రైలును 17, 24 తేదీల్లో పుణే మీదుగా మళ్లించి నడిపిస్తారని ద.మ.రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని