Torture: వ్యక్తిని చితకబాది.. ట్రక్కుకు కట్టేసి ఈడ్చుకెళ్లి..

ఓ వ్యక్తిని తీవ్రంగా చితకబాది, తాళ్లతో కట్టి ట్రక్కుతో ఈడ్చుకెళ్లిన అమానవీయ ఘటన ఆలస్యంగా

Published : 30 Aug 2021 11:08 IST

ఓ వ్యక్తిని తీవ్రంగా చితకబాది, తాళ్లతో కట్టి ట్రక్కుతో ఈడ్చుకెళ్లిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌ నీమచ్‌ జిల్లాలో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సింగోలీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ గ్రామానికి చెందిన కన్హయలాల్‌ భీల్‌(40) సింగోలీ- నీమచ్‌ ప్రధాన రహదారిపై గత గురువారం నిలుచుని ఉన్నాడు. ఛితర్‌ మాల్‌ గుర్జార్‌ అనే పాల వ్యాపారి ద్విచక్రవాహనంపై వచ్చి భీల్‌ను ఢీకొట్టి కిందపడిపోయాడు. పాలు మొత్తం ఒలికిపోయాయి. పాలు నేలపాలయ్యాయనే కోపంతో భీల్‌పై గుర్జార్‌ దాడి చేశాడు. ఆ తర్వాత తన స్నేహితులను పిలిచి.. కొట్టించాడు. అందరు కలిసి భీల్‌ కాళ్లకు తాడు కట్టి.. ట్రక్కు వెనకాల కట్టేసి కొంత దూరం ఈడ్చుకెళ్లారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే.. దాడికి పాల్పడిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు.. బాధితుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భీల్‌ మృతి చెందాడు. మొత్తం ఎనిమిది మందిపై  కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సూరజ్‌ కుమార్‌ వర్మ తెలిపారు. ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్‌ చేశామని.. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని