Injection: ఆ ఇంజెక్షన్‌తో 15% బరువు తగ్గిపోవచ్చు!

అమెరికాలో ‘వీగోవీ’ అనే ఔషధానికి ప్రస్తుతం భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఊబకాయంతో బాధపడుతున్న వారంతా ఈ మందు కోసం దుకాణాలకు పోటెత్తుతున్నారు. అమెరికా వయోజనుల్లో మూడో వంతు కంటే ఎక్కువమంది

Updated : 06 Nov 2021 09:53 IST

అమెరికాలో భారీ డిమాండ్‌

న్యూయార్క్‌: అమెరికాలో ‘వీగోవీ’ అనే ఔషధానికి ప్రస్తుతం భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఊబకాయంతో బాధపడుతున్న వారంతా ఈ మందు కోసం దుకాణాలకు పోటెత్తుతున్నారు. అమెరికా వయోజనుల్లో మూడో వంతు కంటే ఎక్కువమంది ఊబకాయిలే. దీంతో గిరాకీకి తగ్గట్లుగా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. ఇంజెక్షన్‌ రూపంలో తీసుకొనే ఈ మందుతో 15 శాతం వరకు బరువు తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డెన్మార్క్‌కు చెందిన నోవో నోర్డిస్క్‌ అనే కంపెనీ ‘వీగోవీ’ ఔషధాన్ని తయారుచేస్తోంది. అమెరికాలో దీని వినియోగానికి ఈఏడాది జూన్‌లో అనుమతులు లభించాయి. బరువు తగ్గించే ఓ ఔషధానికి అగ్రరాజ్యంలో అనుమతి లభించడం ఇదే తొలిసారి. గతంలో అనేకం వచ్చినప్పటికీ.. వాటికి నియంత్రణ సంస్థల క్లియరెన్స్‌ లభించలేదు. పైగా తీవ్ర దుష్పభ్రావాలు ఉండేవి. ఈ నేపథ్యంలోనే వీగోవీకి డిమాండ్‌ అమాంతంగా పెరిగిపోయింది. దీన్ని ఇంజెక్షన్‌ రూపంలో వారానికి ఓ డోసు చొప్పున నాలుగు సార్లు తీసుకోవాలి. ఆకలిని నియంత్రించి తద్వారా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. అమెరికాలో ఒక్కసారిగా పెరిగిన డిమాంè్తో దాని తయారీ కంపెనీ ఆదాయం గత త్రైమాసికంలో 41 శాతం ఎగబాకింది. ఈ ఔషధానికి ఇంతలా గిరాకీ పెరగడానికి కొవిడ్‌ కూడా ఓ కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఔషధం వినియోగం వల్ల వాంతులు, యాసిడ్‌ రీఫ్లక్స్‌ వంటి దుష్పభ్రావాలు కూడా ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని