విద్యార్థులకు ఉచిత సెల్‌ఫోన్‌

రాష్ట్రంలోని యువతకు సెల్‌ఫోన్లు అందించనున్నట్లు పంజాబ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఓ పథకాన్ని ప్రవేశపెట్టి..

Published : 12 Aug 2020 02:19 IST

చండీగఢ్‌‌: రాష్ట్రంలోని యువతకు సెల్‌ఫోన్లు అందించనున్నట్లు పంజాబ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఓ పథకాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా యువతకు మొబైల్‌ ఫోన్లు అందిచనున్నట్లు మంగళవారం పేర్కొంది. ‘కరోనా గడ్డు కాలంలో ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరు కాలేక అనేక మంది విద్యార్థులు బాధలు పడుతున్నారు. ప్రభుత్వం అందించబోతున్న సెల్‌ఫోన్లు వారికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి’ అని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఫోన్ల ద్వారా వారి విద్యకు ఉపయోగపడే సమాచారాన్ని ఆన్‌లైన్‌లో సులువుగా పొందవచ్చని తెలిపింది. పాఠశాల విద్యాశాఖ పోస్టు చేసిన సమాచారాన్ని సైతం సెల్‌ఫోన్ల ద్వారా సులువుగా పొందవచ్చు అని పేర్కొంది. మొదటి విడతలో 1.75 లక్షల మొబైల్‌ ఫోన్లను అమరిందర్‌సింగ్‌ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 2017లో అధికారంలోకి వచ్చేముందు రాష్ట్రంలోని యువతకు సెల్‌ఫోన్లు అందిస్తామని కాంగ్రెస్‌ హామీఇచ్చింది. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని