Published : 26/09/2020 18:26 IST

శ్రీలంక ప్రధానితో మోదీ కీలక చర్చలు

పలు అభివృద్ధి ప్రాజెక్టులపై ఒప్పందాలు

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక ప్రధానమంత్రి మహీంద రాజపక్సతో శనివారం ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇరు దేశాల అభ్యున్నతికి కీలక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య బౌద్ధ సంస్కృతిని ప్రోత్సహించుకునేందుకు శ్రీలంకకు భారత్‌ 15 మిలియన్‌ డాలర్లు అందించనుంది. బౌద్ధ మఠాల పునరుద్ధరణ, ఇరు దేశాల మధ్య బౌద్ధ సంస్కృతి అభివృద్ధి, బౌద్ధ మతాధికారుల మద్దతుకు శ్రీలంక ఆ డబ్బును వినియోగించనుంది. పొరుగుదేశం 1.1 బిలియన్ డాలర్ల అభ్యర్థనపై భారత్‌ ప్రస్తుతం చర్చలు జరుపుతోంది.

శిఖరాగ్ర సమావేశంలో ప్రధానులిద్దరు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై సైతం చర్చించారు. రానున్న ఐదేళ్లలో చేపట్టబోయే పలు అభివృద్ది ప్రాజెక్టులపై ఓ అంగీకారానికి వచ్చాయి. ఇరు దేశాల మధ్య విమాన రాకపోకలను భారత్ ప్రతిపాదించింది. కొలంబోలో పలు భారతీయ ఉత్పత్తుల దిగుమతిపై తాత్కాలిక ఆంక్షలను సడలిస్తారని ఆశిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. పొరుగు దేశంతో సత్సంబంధాలకు భారత్‌ ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని ఈసందర్భంగా మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న బంధం ఎన్నో ఏళ్ల నాటిదని ఈసందర్భంగా పునరుద్ఘాటించారు. భారత్‌-శ్రీలంక మధ్య సంబంధం వేల ఏళ్ల క్రితం నాటిది. రెండు దేశాల మధ్య సంబంధాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాం’ అని ప్రధాని అన్నారు. శ్రీలంక తమిళుల సమస్యను పరిశీలించాలని ఈసందర్భంగా రాజపక్సను కోరారు.
 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని