బీరుట్‌ సగం వైద్యశాలలు మూత ..!

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో భారీ పేలుడు తర్వాత పరిస్థితి నానాటికి దిగజారుతోంది. నగరానికి అవసరమైన ఆహార ధాన్యాల గోదాము ఓడరేవులోనే ఉండటంతో ధ్వంసమైపోయింది. నోటి వద్ద ఆహారం నీటిపాలైంది. ఆ పేలుడు తీవ్రతకు

Updated : 13 Aug 2020 15:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో భారీ పేలుడు తర్వాత పరిస్థితి నానాటికి దిగజారుతోంది. నగరానికి అవసరమైన ఆహార ధాన్యాల గోదాము ఓడరేవులోనే ఉండటంతో ధ్వంసమైపోయింది. నోటికందాల్సిన ఆహారం నీటిపాలైంది. ఈఘటనలో దాదాపు 5,000 మంది గాయపడ్డారు. కానీ, వీరికి చికిత్సను అందించేందుకు తగినన్ని ఆసుపత్రులు అందుబాటులో లేవు. పులిమీద పుట్రలాగా.. నగరంలోని దాదాపు సగం ఆసుపత్రులు పనికిరాని స్థితికి చేరుకొన్నాయి. 

నగరంలోని ఆసుపత్రుల్లోని ఎమర్జెన్సీ గదులు నిరుపయోగంగా మారాయి. చాలా ఆసుపత్రుల్లో పరికరాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే వెల్లడించింది. బీరుట్‌లో మొత్తం 55 క్లీనిక్‌లు ఉన్నాయి. వీటిల్లో సగం పనిచేయడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ రీజనల్‌ డైరెక్టర్‌ రిచర్డ్‌ బ్రెన్నన్‌ తెలిపారు. వీటిల్లో మూడు పెద్ద ఆసుపత్రులు కూడా ఉన్నాయన్నారు. మృతుల సంఖ్య 170ని దాటినట్లు సమాచారం. 

గతేడాది నుంచి దేశంలో ఆర్థిక సంక్షోభం ఉండటంతో ఆ ప్రభావం ఆసుపత్రులపై కూడా పడింది. అత్యవసరాల్లో వినియోగించే పరికరాల కొరత తీవ్రంగా ఉంది. ఇక ప్రభుత్వ ఆసుపత్రులు చెల్లింపులే మిలియన్ల డాలర్లలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు పేలుడు కారణంగా ఉన్న అరకొర పరికరాలు దెబ్బతిన్నాయి.  సాధారణ రోజుల్లో దాదాపు రెండు నెలలకు సరిపడా వైద్య పరికరాలను పేలుడు జరిగిన తొలిరోజే వాడాల్సి వచ్చిందని రెడ్‌క్రాస్‌ బృందం వెల్లడించింది.  దీంతో చాలా మంది బాధితులకు చికిత్స అందలేదు. తాజాగా లెబనాన్‌లో జరుగుతున్న ఆందోళనల్లో శరీర గాయాల పచ్చి ఆరకుండానే చాలా మంది పాల్గొంటున్నారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని