నోవావాక్స్‌ వ్యాక్సిన్‌.. ఆశాజనక ఫలితాలు 

ప్రపంచాన్ని కొవిడ్‌ వణికిస్తున్న వేళ.. వ్యాక్సిన్‌పై ప్రయోగాలు ఆశాజనక ఫలితాలను చూపించడం మానవాళికి ఊరట కలిగిస్తోంది. తాజాగా అమెరికా బయోటెక్‌ కంపెనీ నోవావాక్స్‌ తమ కొవిడ్‌ 19 వ్యాక్సిన్‌ బలమైన

Updated : 05 Aug 2020 17:08 IST

భారీ స్థాయిలో ప్రతినిరోధకాలను ఉత్పత్తి చేస్తోందని కంపెనీ వెల్లడి

వాషింగ్టన్‌ : ప్రపంచాన్ని కొవిడ్‌ వణికిస్తున్న వేళ.. వ్యాక్సిన్‌పై ప్రయోగాలు ఆశాజనక ఫలితాలను చూపించడం మానవాళికి ఊరట కలిగిస్తోంది. తాజాగా అమెరికా బయోటెక్‌ కంపెనీ నోవావాక్స్‌ తమ కొవిడ్‌ 19 వ్యాక్సిన్‌ బలమైన రోగనిరోధక శక్తి ఇస్తుందని ప్రకటించింది. ప్రస్తుతం కోలుకున్న రోగులలో ఉన్నదానికంటే ఎక్కువ ప్రతినిరోధకాలను ఇది ఉత్పత్తి చేస్తోందని తెలిపింది. వ్యాక్సిన్‌ విజయంపై ఇది ఆశలను పెంచుతోందని పేర్కొంది. ప్రారంభ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాను విశ్లేషించి ఆ కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. 

కీలకమైన మూడో దశ ట్రయల్స్‌ను భారీ ఎత్తున్న సెప్టెంబర్‌లో చేపడతామని.. వచ్చే ఏడాది 1 బిలియన్‌ నుంచి 2 బిలియన్ల  వ్యాక్సిన్‌ డోస్‌లను ఉత్పత్తి చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది.

కరోనా వైరస్‌పై పోరులో భాగంగా ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ రూపొందించడం కోసం అమెరికా ప్రభుత్వం 1.6 బిలియన్‌ డాలర్లను నొవావాక్స్‌కు ఇచ్చింది. అయితే మోడెర్నా, అస్ట్రాజెనికాలతో పోల్చితే వ్యాక్సిన్‌ రేసులో నోవావాక్స్‌ కాస్త వెనుకబడే ఉంది. ఆ రెండు ఇప్పటికే తుది దశ క్లినికల్‌ ట్రయల్స్‌లోకి ప్రవేశించాయి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని