Updated : 20/12/2020 18:01 IST

నేపాల్‌లో మధ్యంతర ఎన్నికలు

పార్లమెంటు రద్దుకు రాష్ట్రపతి ఆమోదం

కాఠ్‌మండూ: నేపాల్‌లో రాజకీయ వివాదం తారాస్థాయికి చేరుకుంది. అధికార పార్టీలో తలెత్తిన వివాదాలు పార్లమెంటు రద్దుకు దారితీశాయి. దీంతో పార్లమెంటును రద్దు చేయాలంటూ చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆ దేశ ప్రధాని కె.పి.శర్మ ఓలీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి మండలి చేసిన సిఫారసుకు అధ్యక్షురాలు, రాష్ట్రపతి విద్యాదేవి భండారి తాజాగా ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయంతో నేపాల్‌లో త్వరలోనే రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 30, మే 10న పార్లమెంటు ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

ప్రధాని కె.పి.శర్మ ఓలీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి మండలి.. పార్లమెంటును రద్దుచేయాలంటూ మండలి అధ్యక్షురాలు విద్యాదేవీ భండారీకి సిఫారసు చేసింది. ఆదివారం ఉదయం అత్యవసర సమావేశం నిర్వహించిన మంత్రి మండలి ఈ మేరకు అనూహ్య నిర్ణయం తీసుకుంది. అధికార నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సీపీ)లో కొంతకాలంగా తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయి ప్రధాని పీఠం కోసం ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తాజా ఘటనతో అవి మరింత తారస్థాయికి చేరుకున్నట్లైంది.

ఇవీ చదవండి..

నేపాల్‌ పార్లమెంట్‌ రద్దుకు ప్రధాని సిఫారసు!

అలా చేయకపోతే.. చైనా నుంచి మరో మహమ్మారి


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని