మాస్కులతో క్యాట్‌వాకు.. కరోనా దరిచేరమాకు!

ఫ్యాషన్‌ షో అనగానే.. వయ్యారాలు ఒలకబోస్తూ నడిచే అందమైన భామలు.. ధగధగ లాడే దుస్తులు.. తలతల మెరిసే ఆభరణాలే గుర్తొస్తాయి. ఈ  జాబితాలో ఇప్పుడు కొత్త ఆభరణం వచ్చి చేరింది. కొవిడ్‌-19 పుణ్యమా అని ఇందులో ఫేస్‌మాస్క్‌ కూడా అంతర్భాగమైపో........

Published : 28 Jul 2020 01:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫ్యాషన్‌ షో అనగానే.. వయ్యారాలు ఒలకబోస్తూ నడిచే అందమైన భామలు.. ధగధగ లాడే దుస్తులు.. తలతల మెరిసే ఆభరణాలే గుర్తొస్తాయి. ఈ  జాబితాలో ఇప్పుడు కొత్త ఆభరణం వచ్చి చేరింది. కొవిడ్‌-19 పుణ్యమా అని ఇందులో ఫేస్‌మాస్క్‌ కూడా అంతర్భాగమైపోయింది. ఈ వినూత్న ఫ్యాషన్‌షోకు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ వేదికైంది.

ఇటీవల జరిగిన ఈ ఫ్యాషన్‌ షోలో పాల్గొన్న ప్రతి ఒక్క మోడల్‌ కూడా ఫేస్‌మాస్క్‌ ధరించడం గమనార్హం. కరోనా నుంచి రక్షణ పొందేందుకు ఏదో మాస్కు ధరించాం అన్నట్లు కాకుండా.. దుస్తులకు నప్పే మాస్కులను డిజైనర్లు రూపొందించడం గమనార్హం. విభిన్న డిజైన్లలో, విభిన్న రంగుల దుస్తులతో పాటు విభిన్న రకాల ఫేస్‌మాస్కులు కూడా ఈ షోలో దర్శనమిచ్చాయి. 

‘‘ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా క్లిష్ట పరిస్థితి నెలకొంది. కరోనాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా  ప్రజలు పోరాడుతున్నారు. ఇలాంటి స్థితిలో వారిలో ఓ కొత్త ఉత్సాహం నింపేందుకు ఈ షో నిర్వహిస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు నిర్వాహకులు లిమ్‌ యాన్‌ హీ. అంతేకాదు కొవిడ్‌-19 కారణంగా ఇతర ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయిన వేళ దాన్ని అధిగమించడంలో భాగంగా దీన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దక్షిణకొరియాలో మొత్తం కేసుల సంఖ్య 14వేలు దాటగా.. మరణాల సంఖ్య 300కు చేరువైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని