కరోనా స్ట్రెయిన్‌: మహారాష్ట్రలో కర్ఫ్యూ!

యూకేలో కొత్తరకం కరోనా స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న తరుణంలో.. అటు కేంద్రంతో పాటు, మహారాష్ట్ర సర్కారు కూడా అప్రమత్తమైంది. అర్ధరాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 21 Dec 2020 20:39 IST

ముంబయి: యూకేలో కొత్తరకం కరోనా స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న తరుణంలో.. అటు కేంద్రంతో పాటు, మహారాష్ట్ర సర్కారు కూడా అప్రమత్తమైంది. రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయి సహా పలు ప్రధాన నగరాల్లో ఈ కర్ఫ్యూను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘రాష్ట్ర రాజధాని ముంబయి సహా పలు ప్రధాన నగరాల్లో రాత్రి కర్ఫ్యూ ఉంటుంది. ఈ కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు అమల్లో ఉంటుంది. ఈ పద్ధతి జనవరి 5 వరకు కొనసాగుతుంది. ఇతర యూరప్‌ దేశాల నుంచి వచ్చే వారు తప్పకుండా 14రోజుల క్వారంటైన్‌లో ఉండాలి’ అని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

కర్ణాటక ప్రభుత్వమూ అలెర్ట్‌
బ్రిటన్‌లో కొత్త కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అలెర్ట్‌ అయ్యింది. ఈ నెల 7 నుంచి రాష్ట్రంలో అడుగుపెట్టిన ప్రయాణికుల వివరాలు ఇవ్వాలని బెంగళూరు, మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలను కోరింది. బ్రిటన్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయాలని ఆదేశించింది. బ్రిటన్‌ విమానాశ్రయాల నుంచి వచ్చిన వారికే కాకుండా, ఇతర దేశాల్లోని ఎయిర్‌పోర్టులను నుంచి ప్రయాణించిన వారికి కూడా పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి

బ్రిటన్‌ నుంచి భారత్‌కు విమానాల రద్దు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని