కొవిడ్‌19: లాటిన్‌ అమెరికాలో మృత్యుఘోష!

కరోనా వైరస్‌ దెబ్బకు లాటిన్‌ అమెరికా దేశాలు వణికిపోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వైరస్ అధిక తీవత్ర కొనసాగుతోన్న దేశాల్లో అమెరికా తొలిస్థానంలో ఉండగా, అటు లాటిన్‌ అమెరికా దేశాలు కూడా విలవిలలాడుతున్నాయి.

Published : 21 Aug 2020 14:37 IST

2.5లక్షల మంది వైరస్‌కు బలి
అమెరికా దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి

రియో డె జనైరో: కరోనా వైరస్‌ దెబ్బకు లాటిన్‌ అమెరికా దేశాలు వణికిపోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వైరస్ అధిక తీవత్ర కొనసాగుతోన్న దేశాల్లో అమెరికా తొలిస్థానంలో ఉండగా, అటు లాటిన్‌ అమెరికా దేశాలు కూడా విలవిలలాడుతున్నాయి. ముఖ్యంగా బ్రెజిల్‌, మెక్సికోతో పాటు కొలంబియా, పెరూ దేశాల్లో ఈ వైరస్‌ ప్రభావం అధికంగా ఉంది. తాజాగా లాటిన్ అమెరికా దేశాల్లో కరోనా మరణాల సంఖ్య రెండున్నర లక్షలు దాటడం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటికే యూరప్‌లో ప్రతాపం చూపిన ఈ మహమ్మారి ఉత్తర అమెరికాతోపాటు లాటిన్ అమెరికాను వెంటాడుతోంది. లాటిన్‌ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్‌లో ఇప్పటికే లక్షా 12వేల మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య 35లక్షలు దాటింది. ఇక మరో లాటిన్‌ దేశం మెక్సికో, కరోనా మరణాల్లో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. మెక్సికోలో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు మెక్సికోలో 5లక్షల 43వేల కేసులు నమోదుకాగా వీరిలో 59వేల మంది వైరస్‌కు బలయ్యారు. బ్రెజిల్‌లో నిన్న ఒక్కరోజే 1200మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు వారాల్లో రోజువారీ మరణాల సంఖ్య 3వేలుగా ఉంది. ప్రస్తుతం బ్రెజిల్‌లో రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ చిలి, పెరూ, కొలంబియా, అర్జెంటీనా దేశాల్లో వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది.

ఇదిలాఉంటే, అమెరికాలోనూ కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 55లక్షల దాటగా లక్షా 74వేల మంది మృత్యువాతపడ్డారు. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ నివేదిక ప్రకారం..లాటిన్‌ అమెరికా దేశాల్లో నమోదైన కరోనా మరణాల సంఖ్య..

దేశం       మరణాల సంఖ్య
బ్రెజిల్‌       1,12,304
మెక్సికో      59,106
పెరూ       26,834
కొలంబియా  16,183
చిలి         10,671
అర్జెంటీనా     6,517

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని