లాటిన్‌ అమెరికాలో మృత్యుఘోష: 2లక్షల మరణాలు!

 లాటిన్ అమెరికాలోనూ కరోనా మహమ్మారి మృత్యుఘోష సృష్టిస్తోంది. లాటిన్ అమెరికా దేశాల్లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2లక్షలు దాటింది.

Published : 03 Aug 2020 01:14 IST

బ్రెజిల్‌, మెక్సికో దేశాల్లో కరోనా విలయతాండవం

లీమా: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి ఉత్తర, దక్షిణ అమెరికాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే అమెరికాలో అత్యధికంగా 46లక్షల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా లక్షా 54వేల మంది మృత్యువాతపడ్డారు. నిత్యం కొత్తగా 60వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, లాటిన్ అమెరికాలోనూ కరోనా మహమ్మారి మృత్యుఘోష సృష్టిస్తోంది. లాటిన్ అమెరికా దేశాల్లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2లక్షలు దాటింది. ముఖ్యంగా బ్రెజిల్‌, మెక్సికో దేశాల్లో అత్యధిక మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. లాటిన్‌ అమెరికా దేశాల్లో నమోదవుతున్న మొత్తం మరణాల్లో కేవలం ఈ రెండు దేశాల్లోనే 70శాతం చోటుచేసుకుంటున్నాయి. ఆయా దేశాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడం అక్కడి ప్రభుత్వాలకు కష్టంగా మారింది. బ్రెజిల్‌లో నిత్యం దాదాపు వెయ్యికి పైగా కరోనా మరణాలు నమోదుకావడం పరిస్థితికి అద్ధం పడుతోంది. అటు మెక్సికోలోనూ నిత్యం 700పైగా మరణాలు సంభవిస్తున్నాయి. వీటితోపాటు పెరూ, చీలీ, అర్జెంటీనా దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈక్వెడార్‌లోనూ పరిస్థితి దారుణంగా ఉన్నట్లు బయటపడుతోంది. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ నివేదిక ప్రకారం..లాటిన్ అమెరికాలోని పలు దేశాల్లో నమోదైన మరణాల సంఖ్య ఈ విధంగా ఉన్నాయి.

దేశం     మరణాల సంఖ్య
బ్రెజిల్‌       93,563
మెక్సికో     47,472
పెరూ       19,021
కొలంబియా  10,330
చీలీ         9,533
అర్జెంటీనా    3596

ఇవీ చదవండి...
భారత్‌లో 17లక్షల కేసులు, 37వేల మరణాలు
అమెరికాలో కోట్లు కురిపించిన...అల్లం చాయ్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని