సిరియాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి..

సిరియాపై ఇజ్రాయెల్‌ దాడి.. సిరియా వైమానిక దళం దీటుగా స్పందన

Updated : 03 Mar 2023 16:30 IST

బీరుట్: ఇజ్రాయెల్‌కు చెందిన కొన్ని జెట్‌ విమానాలు ఈ ఉదయం లెబనాన్‌ భూభాగంలో అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణించినట్టు సమచారం. రాజధాని బీరుట్‌ గగనతలంలో క్షిపణులు‌ ఎగరటం తాము చూశామని కొందరు పౌరులు తెలిపారు. తమ గగనతలంలో చొరబడటం ఆ దేశానికి పరిపాటి అయినప్పటికీ.. ఈ సారి విమానాల శబ్దం మరింత అధికంగా వినిపించిందని బీరుట్‌ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు మధ్య సిరియాకు చెందిన మాసైయాఫ్‌ నగరంలో పేలుళ్లు సంభవించినట్టు సిరియా అధికారిక మీడియా ప్రకటించింది. ఇజ్రాయెల్‌ ఇక్కడి హమా ప్రాంతంలో దాడి చేసిందని.. ఇందుకు సిరియా వైమానిక దళం దీటుగా స్పందించిందని ఆ దేశ మీడియా ప్రకటించింది. కాగా, ఏ లక్ష్యం కోసం ఈ దాడి జరిగిందీ, మృతుల సంఖ్య తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నేడు క్రిస్మస్‌ పర్వదినం కావటంతో.. ఈ ఘటనలతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

గత కొంత కాలంగా సిరియాపై ఇజ్రాయెల్ పదుల సంఖ్యలో గగనతల దాడులకు పాల్పడింది. వీటిలో ఆయుధ రవాణా శ్రేణిపైనే అధికంగా దాడులు చోటుచేసుకోవటం గమనార్హం. ఇక తాజా దాడి జరిగిన మాసైయాఫ్‌ సైతం మిలిటరీ ప్రాంతమే. ఓ మిలిటరీ అకాడమీతో పాటు శాస్త్రీయ పరిశోధనాశాల కూడా ఉన్న ఈ ప్రాంతంపై ఇజ్రాయెల్‌ గతంలో కూడా పలు దాడులు నిర్వహించింది. ఇక ఆగస్టు 4న బీరుట్‌లో చోటుచేసుకున్న ఓ భారీ పేలుడులో 200 మదికి పైగా మృతిచెందిన సంగతి తెలిసిందే. అమ్మోనియం నైట్రేట్‌ నిల్వ ఉంచిన గోదాముల్లో సంభవించిన అగ్నిప్రమాదం ఈ దుర్ఘటనకు దారితీసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని