జర్నలిస్టును ఉరితీసిన ఇరాన్‌ 

ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఓ జర్నలిస్టును ఇరాన్‌ ప్రభుత్వం ఉరితీసింది. ప్రముఖ సామాజిక కార్యకర్త, అమద్‌ న్యూస్‌ వ్యవస్థాపకుడు జామ్‌కు అక్కడి సుప్రీంకోర్టు

Updated : 12 Dec 2020 16:26 IST

టెహ్రాన్‌: ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఓ జర్నలిస్టును ఇరాన్‌ ప్రభుత్వం ఉరితీసింది. ప్రముఖ సామాజిక కార్యకర్త, అమద్‌ న్యూస్‌ వ్యవస్థాపకుడు రౌహొల్లా జామ్‌కు అక్కడి సుప్రీంకోర్టు మరణశిక్ష విధించగా.. శనివారం ఉదయం శిక్ష అమలు చేశారు. 

 2017-18లో ధరల పెరుగుదలపై ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ నిరసనల్లో రుహొల్లా  కీలక పాత్ర పోషించడమేగాక, తన న్యూస్‌ ఛానల్‌లో ఆందోళనలను ప్రత్యేకంగా కవర్‌ చేశారు. దీంతో అతడిపై ఇరాన్‌ చట్టంలోనే  అత్యంత తీవ్ర నేరమైన అవినీతి కేసు నమోదైంది. అంతేగాక, పలు దేశాల నిఘా సంస్థలు జామ్‌కు రక్షణ కల్పిస్తున్నాయని ఇరాన్‌ ఆరోపించింది. దేశ భద్రతను పణంగా పెట్టి ఫ్రాన్స్‌, మరికొన్ని దేశాలకు గూఢచర్యం చేస్తున్నాడని అతడిపై కేసులు నమోదుచేసింది. 

అయితే 2009 ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికల తర్వాత ఫ్రాన్స్‌కు పారిపోయిన అతను.. అక్కడే అమద్‌ న్యూస్‌ను ఛానల్‌ను స్థాపించారు. టెలిగ్రామ్‌ యాప్‌ వేదికగా ఈ ఛానల్‌ను నిర్వహించారు. కాగా.. ఫ్రాన్స్‌లో ఉన్న అతనిని అత్యంత చాకచక్యంగా ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ స్వదేశానికి రప్పించాయి. గతేడాది అక్టోబరులో రౌహోల్లాను అరెస్టు చేసినట్లు ప్రకటించాయి. ఈ ఏడాది జూన్‌లో జామ్‌కు మరణశిక్ష విధిస్తూ ఇరాన్‌ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో నేడు శిక్ష అమలు చేస్తూ జామ్‌ను ఉరితీశారు. 

ఇవీ చదవండి..

సీబీఐ కస్టడీ నుంచి 100 కిలోల బంగారం మాయం 

కుటుంబ నియంత్రణపై బలవంతం చేయలేం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని