Updated : 10/09/2020 17:29 IST

బీరుట్‌లో మరో భారీ ప్రమాదం!

బీరుట్‌: లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో మరోసారి భారీ ప్రమాదం చోటుచేసుకుంది. గత నెలలో బీరుట్‌ ఓడరేవులో 3వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ పేలుళ్లతో నెలకొన్న విషాదం ఇంకా వెంటాడుతున్న నేపథ్యంలో తాజాగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో అగ్నికీలలు ఎగసిపడి దట్టమైన పొగలు ఆకాశంలో కమ్ముకున్నాయి. ఇంజిన్‌ ఆయిల్‌, వాహనాల టైర్లను నిల్వ చేసే గోదాంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు అక్కడి సైన్యం తెలిపింది. ఈ ప్రమాదానికి కారణాలేమిటి? ఎంత నష్టం జరిగిందనే విషయాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఆగస్టు 4న అమ్మోనియం నైట్రేట్‌ నిల్వ చేసే గోదాంలో భారీ పేలుళ్లు సంభవించిన ఘటనలో 190 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 6500 మంది గాయపడిన ఘటన యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతేకాకుండా వేలాది భవంతులు ధ్వంసమైయ్యాయి. ఆ భయమే ఇంకా జనాన్ని వెంటాడుతున్న పరిస్థితుల్లో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని