టీకా కంటే ముందే హెర్డ్‌ ఇమ్యూనిటీ!

కొవిడ్-19 టీకా అందుబాటులోకి రావడానికి కంటే ముందే దేశ ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీని పొందే అవకాశం ఉందని తాజాగా ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు.

Published : 15 Nov 2020 03:23 IST

వెల్లడించిన ఎయిమ్స్ డైరెక్టర్ 

దిల్లీ: కొవిడ్-19 టీకా అందుబాటులోకి రావడానికి కంటే ముందే దేశ ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీని పొందే అవకాశం ఉందని తాజాగా ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. ‘మేము మంచి రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నామన్న దశకు మనం చేరుకోవచ్చు. అప్పుడు టీకా ప్రయోజనం ఉండదు. కాకపోతే ఒక సమస్య ఉంది. వైరస్ మార్పులు చెందితే..రీ ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో వైరస్‌ స్పందించే తీరుపై మేం అంచనా వేస్తున్నాం. దాని ఆధారంగా ఎంత తరచుగా టీకా తీసుకోవాల్సి ఉంటుందో అర్థమవుతుంది’ అని వెల్లడించారు. 

ఇక, ప్రపంచ వ్యాప్తంగా చివరి దశ ప్రయోగాలు జరుపుకొంటున్న పలు కంపెనీల టీకాలకు ఈ ఏడాది చివర్లోకానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ ఆమోదం లభించే అవకాశం ఉంది. అయితే, అధిక జనాభా కలిగిన మనదేశంలో ప్రతి ఒక్కరికి టీకాను అందించడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. ఇదిలా ఉండగా..టీకా పంపిణీకి సంబంధించి కేంద్రం ఇప్పటికే కార్యచరణను సిద్ధం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని