ఎస్‌ఏడీ నాయకురాలు హర్‌సిమ్రత్‌ అరెస్టు

పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్‌ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ను గురువారం ఛండీగఢ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యవసాయ బిల్లులకు.....

Published : 01 Oct 2020 22:39 IST

చండీగఢ్‌: పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్‌ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ను గురువారం ఛండీగఢ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేక నిరసనలో భాగంగా ఆమె చండీగఢ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను చండీగఢ్‌- జిరక్‌పూర్‌ సరిహద్దు ప్రాంతంలో అడ్డుకుని అరెస్టు చేశారు. దీనిపై ఆమె ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘రైతుల కోసం గళం విప్పినందుకు మమ్మల్ని అరెస్టు చేశారు. కానీ వారు మమ్మల్ని అణచలేరు. మేము సత్య మార్గాన్ని అనుసరిస్తున్నాం. మీ బలగంతో మా శక్తిని అణచలేరు’ అని ఆమె ట్వీట్‌ చేశారు. 

కేంద్ర వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీయే కూటమి పార్టీ శిరోమణి అకాలీదళ్‌ కూటమి నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రిగా ఉన్న హర్‌సిమ్రత్‌ కౌర్‌ సైతం బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండు చేస్తూ తన పదవికి రాజీనామా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు