భారతీయ శైలిలో ఫ్రెంచ్‌, జర్మన్‌ అధినేతలు..

యూరప్‌లో సంభవించిన తాజా పరిణామాల చర్చకు ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఇటీవల ఫ్రాన్స్‌లో నిర్వహించారు.

Published : 21 Aug 2020 23:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్: యూరప్‌లో సంభవించిన తాజా పరిణామాల చర్చకు ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఫ్రాన్స్‌లో నిర్వహించారు. కరోనా వైరస్‌, బెలారస్‌ రాజకీయ అస్థిరత, లెబనాన్‌ పేలుళ్లు, రష్యా ప్రతిపక్ష నేత ఆరోగ్యస్థితి తదితర అంశాలను గురించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వివిధ యూరప్‌ దేశాల అధినేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఫ్రాన్స్‌ అధినేత అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశానికి విచ్చేసిన జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కల్‌కు.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రోన్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిరువురూ భారతీయ సాంప్రదాయమైన నమస్కారంతో అభివాదం చేసుకోవటం విశేషం. కాగా, ఈ వీడియోను ఫ్రాన్స్‌ అధ్యక్షుడు స్వయంగా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. దీనిలో ఫ్రెంచి ప్రథమ మహిళ బ్రిగిట్టె మాక్రోన్‌ను కూడా చూడవచ్చు. ఈ కీలక సమావేశంలో చైనా-యూరప్‌ సంబంధాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని