దిల్లీ అల్లర్ల కేసు: ఇద్దరు నిర్మాతలకు సమన్లు

ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిర్మాతలకు..

Published : 14 Sep 2020 19:13 IST

దిల్లీ: దిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిర్మాతలకు సమన్లు జారీ చేశారు. డ్యాక్యుమెంటరీ నిర్మాతలు రాహుల్‌ రాయ్‌, సబా దేవన్‌లు విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖలీద్‌ను అరెస్టు చేసిన మరుసటి రోజునే వీరికి సమన్లు జారీ చేయడం గమనార్హం. అల్లర్లకు సంబంధించి దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌లో పోలీసులు రాయ్ పేరును చేర్చారు. నిర్మాతలిద్దరు అల్లర్లకు మద్దతు తెలిపే ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో సభ్యులుగా ఉన్నట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ఈశాన్య దిల్లీలో రెండు వర్గాల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనల్లో 50 మందికి పైగా మృతిచెందగా వందలమంది గాయపడ్డారు. భారీస్థాయిలో ఆస్తినష్టం సంభవించింది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని