రైతులూ.. సంఘ విద్రోహులపై నిఘా వేయండి

రైతుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కొన్ని సంఘ విద్రోహ శక్తులు కుట్ర చేస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ అన్నారు. నిరసనలు చేపట్టిన రైతు సంఘాలు తమ వేదిక దుర్వినియోగం కాకుండా నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. అన్నదాతల పట్ల.....

Published : 11 Dec 2020 21:19 IST

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌

దిల్లీ: రైతుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కొన్ని సంఘ విద్రోహ శక్తులు కుట్ర చేస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ అన్నారు. నిరసనలు చేపట్టిన రైతు సంఘాలు తమ వేదిక దుర్వినియోగం కాకుండా నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. అన్నదాతల పట్ల ప్రభుత్వం సున్నితంగా ఉందని స్పష్టం చేశారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు వారి ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామని వివరించారు.

‘‘రైతుల అభ్యంతరాల పరిష్కారం కోసం రైతు సంఘాలకు ప్రతిపాదనలు పంపించాం. మరిన్ని చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల ముసుగులో రైతు ఉద్యమాన్ని నాశనం చేసేందుకు కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. తమ ఉద్యమ వేదిక దుర్వినియోగం కాకుండా రైతు సోదరులు నిరంతరం నిఘా ఉంచాలని పిలుపునిస్తున్నా’’ అని తోమర్‌ ట్వీట్‌ చేశారు.

దిల్లీలోని సింఘు, టిక్రి వద్ద కొన్ని రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వేర్వేరు అభియోగాలతో అరెస్టు చేసిన రచయితలు, మేధావులను విడుదల చేయాలని కోరుతూ కొన్ని పోస్టర్లు అక్కడ కనిపించాయి. జేఎన్‌యూ విద్యార్థి నేతలు ఖాలిద్‌, షర్జీల్‌ ఇమామ్‌ను విడుదల చేయాలన్న పోస్టర్లూ దర్శనమిచ్చాయి. కాగా తమ ఉద్యమంతో రాజకీయాలకు సంబంధం లేదని రైతులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని