మీరు మొసలిగా మారితే అది మీ సమస్య

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాదిరిగానే బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో కూడా కరోనావైరస్‌ తీవ్రతను తక్కువ చేసి మాట్లాడారు.

Updated : 19 Dec 2020 12:36 IST

కొవిడ్‌ టీకాలపై బ్రెజిల్ అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు

బ్రసిలీయా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాదిరిగానే బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో కూడా కరోనావైరస్‌ తీవ్రతను తక్కువ చేసి మాట్లాడారు. ఆ వైరస్‌ను పట్టించుకోకుండా వ్యవహరించి, దాని బారినే పడ్డారు. చివరకు కొవిడ్ టీకాల విషయంలో కూడా ఆయన వైఖరి ఆలాగే ఉంది. ఒకవైపు, బ్రిటన్‌, యూఎస్‌లో ప్రజలు ఫైజర్ టీకా వేయించుకుంటుంటే, ఆయన మాత్రం..దాని పనితీరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రెజిల్‌లో కూడా ఆ టీకా ప్రయోగదశలో ఉంది. 

‘ఎటువంటి దుష్ప్రభావాలకు మేం బాధ్యత వహించమని, ఫైజర్ ఒప్పందంలో స్పష్టంగా ఉంది. మీరు మొసలిగా మారితే అది మీ సమస్య. మీరు సూపర్‌ హ్యూమన్‌గా మారినా..పురుషుల గొంతు మారినా..వారికి సంబంధం ఉండదు’ అని బొల్సొనారో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

కాగా, బుధవారం దేశంలో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన..ప్రజలందరికీ టీకా ఉచితంగానే అందజేస్తామని, కానీ తప్పనిసరి మాత్రం కాదని వెల్లడించారు. బ్రెజిల్ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చాక, టీకా అందరికి అందుబాటులో ఉంటుందని చెప్పారు. అయితే తనకు ఇప్పటికే వైరస్ సోకి ఉండటంతో తాను మాత్రం టీకా వేయించుకోనని చెప్పడం ఆయన వైఖరికి నిదర్శనం. ఇదిలా ఉండగా..వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు చేతులతో కళ్లు, ముక్కు, మూతి, చెవులు తాకొద్దని వైద్యనిపుణులు చెప్తుంటే..బొల్సొనారో ఆ సూచనను పట్టించుకున్నట్లు కనిపించలేదు. కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ముక్కును తాకుతూ కనిపించారు. కాగా, యూఎస్, భారత్, తరవాత వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది బ్రెజిల్‌లోనే. ప్రస్తుతం అక్కడ 71 లక్షల మందికి పైగా వైరస్ బారిన పడగా, 1.8లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. 

ఇవీ చదవండి:

కోటి దాటిన కరోనా కేసులు

కరోనా టీకా: ఇవి తెలియాలి మరి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని