Published : 16/12/2020 00:03 IST

వారే అసలైన ‘తుక్డే తుక్డే గ్యాంగ్‌’: బాదల్‌

అమృత్‌సర్‌: పంజాబ్‌లో ఉద్రిక్తతలను పెంచడానికి భాజపా ప్రయత్నిస్తోందని శిరోమణి అకాలీదళ్‌ అధినేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ ఆరోపించారు.  ఆ పార్టీపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన అమృత్‌సర్‌లో మాట్లాడిన వీడియోను ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ‘దేశంలో అసలైన తుక్డే తుక్డే గ్యాంగ్‌ భాజపా నాయకులే. అంతేకాకుండా పంజాబ్‌లో విద్వేషాల్ని ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అని బాదల్‌ విమర్శలు చేశారు.

సోమవారం కూడా బాదల్‌ ట్విటర్‌ వేదికగా భాజపాపై విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే. సమాఖ్య సూత్రాలను అతిక్రమిస్తున్నారంటూ భాజపాపై మండిపడ్డారు. ‘వ్యవసాయ చట్టాలను అమలు చేసేందుకు కేంద్రం రాష్ట్రాల అధికారాలను స్వాధీనం చేసుకుందని విమర్శించారు.

శిరోమణి అకాలీదళ్‌ ఎన్డీయే ప్రారంభం నుంచి భాగస్వామిగా ఉంది. కాగా కేంద్రంలోని భాజపా ఇటీవల తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఎన్డీయేలో నుంచి బయటకు వచ్చింది. ఎన్డీయే ప్రభుత్వంలో ఆ పార్టీ తరపున కేంద్రమంత్రిగా ఉన్న హర్‌సిమ్రత్‌ బాదల్‌ కూడా తన పదవికి రాజీనామా చేశారు. 

ఇదీ చదవండి

ఆటోవాలాగా రజనీ.. అరుణాచలం రిపీట్‌?
 


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని