బెంగాల్‌ ఘటనపై విచారణకు అమిత్‌ షా ఆదేశం

పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో ఉన్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్లదాడి ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. ఈ ఘటనపై.....

Updated : 11 Dec 2020 05:11 IST

దిల్లీ/ కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో ఉన్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్లదాడి ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. దాడి ఘటనకు సంబంధించి రెండు నివేదికలను కోరారు. పశ్చిమ బెంగాల్‌లోని శాంతిభద్రతల అంశంపై గవర్నర్‌ను ఓ నివేదిక కోరగా..  ఘటనకు సంబంధించి వివరాలు ఇవ్వాలని అధికారుల నుంచి మరో నివేదిక అడిగారు.

మరోవైపు ఈ ఘటనపై భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తృణమూల్‌ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని భాజపా ఆరోపించింది. దాడి సమయంలో పోలీసులు ఎవరినీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ఆరోపించారు. దీనిపై బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమత స్పందించారు. దాడి ఘటనను భాజపా ఆడుతున్న ‘డ్రామా’గా అభివర్ణించారు. తృణమూల్‌ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. నడ్డా పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఎలాంటి భద్రతా కోరలేదన్నారు. ప్రజలకు భాజపా నచ్చకపోతే తామేం చేస్తామంటూ మమత మేనల్లుడు, ఆ పార్టీ ఎంపీ అభిషేక్‌ వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి..
జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి
దుర్గామాత దీవెనలే నన్ను రక్షించాయి: నడ్డా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని