రైనా బేటా.. దోషుల్ని పట్టుకుంటాం: సీఎం ట్వీట్‌

టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా బంధువుల ఇంట్లో చోటుచేసుకున్న దారుణ ఘటనపై పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ స్పందించారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో.......

Updated : 01 Sep 2020 22:11 IST

చండీగఢ్‌: టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా బంధువుల ఇంట్లో చోటుచేసుకున్న దారుణ ఘటనపై పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ స్పందించారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో జరిగిన ఈ ఘటనతో రైనా కుటుంబంలో విషాదం నెలకొనడంతో అతడికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణకు ఆదేశించినట్టు ట్విటర్‌లో వెల్లడించారు. ఈ దురాగతానికి పాల్పడిన దోషులను గుర్తించి సత్వరమే అరెస్టు చేయాలని డీజీపీని ఆదేశించినట్టు పేర్కొన్నారు. డిప్యూటీ కమిషనర్‌, సీనియర్‌ ఎస్పీ వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను కలిశారని అమరీందర్‌ తెలిపారు. దోషులను పట్టుకొని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో గత నెల  20న రాత్రి నిద్రపోతున్న రైనా కుటుంబ సభ్యులపై కొంతమంది దుండగులు  దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనలో రైనా మామయ్య మృతిచెందగా.. అతడి మేనత్త, వారి ఇద్దరు కుమారులకు తీవ్ర గాయాలయ్యాయి. నిన్న రాత్రి రైనా మేనత్త కొడుకు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనలతో తీవ్ర ఆవేదనకు గురైన సురేశ్‌ రైనా..  పంజాబ్‌లోని తమ కుటుంబ సభ్యులపై చాలా దారుణం జరిగిందంటూ ఈ రోజు ఉదయం ట్వీట్‌ చేశారు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అర్థం కావడంలేదు.. ఇంత దారుణానికి ఒడిగట్టిందెవరో తెలియడంలేదు.. ఆ నేరస్థులు మరిన్ని నేరాలకు పాల్పడకముందే పోలీసులు వారిని పట్టుకోవాలంటూ ట్వీట్‌ చేసి సీఎం అమరీందర్‌సింగ్‌ను ట్యాగ్‌ చేసిన విషయం తెలిసిందే.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని