ఝార్ఖండ్‌లో పోలియో అనుమానిత కేసు

ఝార్ఖండ్‌కు చెందిన ఓ ఆరేళ్ల బాలుడిలో ఇటీవల అనారోగ్యం బారిన పడ్డారు. తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో చిన్నారికి చికిత్స అందించిన వైద్యులు పోలియో లక్షణాలు ఉన్నట్లు అనుమానించారు. ఈ క్రమంలో వాళ్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కార్యకర్తకు ఈ సమాచారాన్ని

Published : 05 Nov 2020 01:09 IST

2014లోనే పోలియో రహిత దేశంగా భారత్

రాంచీ : ఝార్ఖండ్‌కు చెందిన ఓ ఆరేళ్ల బాలుడు ఇటీవల అనారోగ్యం బారిన పడ్డారు. తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో చిన్నారికి చికిత్స అందించిన వైద్యులు పోలియో లక్షణాలు ఉన్నట్లు అనుమానించారు. ఈ క్రమంలో వాళ్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కార్యకర్తకు ఈ సమాచారాన్ని తెలియజేశారు. దీంతో సోమవారం డబ్ల్యూహెచ్‌ఓ కార్యకర్త వ్యాధి నిర్ధారణకు ఆ బాలుడి నుంచి శాంపిల్స్‌ సేకరించి కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌)కు పంపారు. వ్యాధి నిర్ధారణ పరీక్షకు సంబంధించి 15 రోజుల్లో ఫలితం రానుంది. పరీక్షలో పోలియో  కాకపోతే చిన్నారి ఆరోగ్య పరిస్థితికి గల కారణాలను ఐఐఎస్‌ తెలుపుతుందని ఓ వైద్యుడు తెలిపారు. ఇదిలా ఉంటే 2014లోనే భారత్‌ పోలియో రహిత దేశంగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది.

గణాంకాల ప్రకారం మన దేశంలో 2018లో 13, 2019వ సంవత్సరంలో 32, ఈ ఏడాదిలో 19 పోలియో అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఒకటి కూడా పోలియో పాజిటివ్‌గా నిర్ధరణ కాలేదు. 

 

    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని