నేపాల్‌లో వరదల బీభత్సం: 38మంది మృతి

నేపాల్‌లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలతో సంభవించిన వరదలు బీభత్సం సృష్టించాయి. దీనికి తోడు పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో .......

Published : 04 Jul 2021 01:36 IST

కాఠ్‌మాండూ: నేపాల్‌లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలతో ఉప్పొంగిన నదులతో సంభవించిన వరదలు బీభత్సం సృష్టించాయి. దీనికి తోడు పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో ప్రాణనష్టం జరిగింది. గడిచిన 20 రోజుల వ్యవధిలో ఈ ప్రకృతి విలయం దాటికి 38మంది మృతిచెందగా.. 50మందికి పైగా గాయపడినట్టు నేపాల్‌ హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నట్టు పేర్కొంది. 51 మంది గాయాలతో కోలుకుంటుండగా.. ముగ్గురు చిన్నారులు సహా 24 మంది వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో గల్లంతైనట్టు వివరించింది. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నేపాల్‌ సైన్యం, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపింది. వరదలతో మొత్తంగా 790 ఇళ్లు నీట మునగగా.. పలు వంతెనలు ధ్వంసమైనట్టు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని