Odisha: ఒకే పాఠశాలలో 26 మంది విద్యార్థినులకు కరోనా!

ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో.. ఒకే పాఠశాలకు చెందిన 26 మంది విద్యార్థినులకు కరోనా సోకింది.

Published : 27 Nov 2021 18:00 IST

భువనేశ్వర్‌: ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో.. ఒకే పాఠశాలకు చెందిన 26 మంది విద్యార్థినులకు కరోనా సోకింది. థాకుర్‌ముండాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఈ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 259 మంది విద్యార్థినులు, 20 మంది సిబ్బంది ఉన్న ఈ పాఠశాలలో పెద్ద ఎత్తున కేసులు బయటపడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే.. వెంటనే బాధితులను తరలించేందుకు వీలుగా పాఠశాల వద్ద అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. పాఠశాలకు వస్తున్న కొందరు బాలికలు స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు ఉపాధ్యాయులు గమనించారు. బాధిత విద్యార్థినులకు గత గురువారం కరోనా పరీక్షలు నిర్వహించగా.. 26 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు వెల్లడైంది. ప్రస్తుతం బాధితులందరినీ పాఠశాల ప్రాంగణంలోనే ఉంచి వైద్యసేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read latest National - International News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని