AP news : ఆ మహిళల ఖాతాల్లోకి నేడు రూ.15 వేలు జమ !

అగ్రవర్ణ మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. మంగళవారం వర్చువల్‌గా ఈ కార్యక్రమం...

Updated : 25 Jan 2022 03:47 IST

అమరావతి : అగ్రవర్ణ మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. మంగళవారం వర్చువల్‌గా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని  3.92 లక్షల మందికి లబ్ధిదారులకు రూ.589 కోట్లు విడుదల చేయనున్నారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జగన్‌ ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.15వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు సాయం చేయనున్నారు. 45 నుంచి 60 ఏళ్లలోపు పేద అగ్రవర్ణ మహిళలు ఈ పథకానికి అర్హులు. బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, వెలమ, ఇతర మహిళలకు ఈబీసీ నేస్తం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని