‘జాతీయ యూత్‌ పార్లమెంట్‌’లో బడ్జెట్‌పై చర్చ

యువతలో రాజ్యాంగ స్ఫూర్తి నింపేందుకు యూత్‌ పార్లమెంట్‌ క్లబ్‌లను ప్రోత్సహించాలని గతేడాది భారత రాజ్యాంగ దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికిన విషయం తెలిసిందే. ఆయన మాటను ప్రేరణగా తీసుకున్న కార్తీకేయ గోయెల్‌ అనే విద్యార్థి ‘జాతీయ యూత్‌ పార్లమెంట్‌’ ను విజయవంతంగా నిర్వహించారు.

Published : 09 Jan 2021 17:15 IST

ఎన్‌వైపీవో వ్యవస్థాపకుడు కార్తికేయ గోయెల్

దిల్లీ: యువతలో రాజ్యాంగ స్ఫూర్తి నింపేందుకు యూత్‌ పార్లమెంట్‌ క్లబ్‌లను ప్రోత్సహించాలని గతేడాది భారత రాజ్యాంగ దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆయన మాటను ప్రేరణగా తీసుకున్న కార్తికేయ గోయెల్‌ అనే విద్యార్థి ‘జాతీయ యూత్‌ పార్లమెంట్‌’ ను విజయవంతంగా నిర్వహించారు. భారత పార్లమెంటులో త్వరలో బడ్జెట్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. జనవరి 7, 8 తేదీల్లో జాతీయ యూత్‌ పార్లమెంట్‌ ఆధ్వర్యంలో నమూనా బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించారు. ఈ నమూనా బడ్జెట్‌ చర్చల్ని భారత లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా జనవరి 7న ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం నుంచి 5గురు చొప్పున మొత్తం 150 మంది యూత్‌ పార్లమెంటేరియన్లు పాల్గొన్నారు. దేశ ఆర్థికవ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లుగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యూత్‌ పార్లమెంటేరియన్లు ఈ చర్చలో తమ ఆలోచనలను వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా యూత్‌ పార్లమెంట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ‘ఎన్‌వైపీవో’ వ్యవస్థాపకుడు కార్తికేయ గోయెల్‌ ప్రయత్నాల్ని అభినందించారు. కార్తికేయ గోయెల్‌ మాట్లాడుతూ.. ‘మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న క్రమంలో భారత్‌కు 2021 బడ్జెట్‌ ఎంతో కీలకం. దేశంలోని అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్‌ ఉండాలి. ముఖ్యంగా పేదరికం, ఆకలి చావులు, నిరుద్యోగం వంటి అంశాలకి బడ్జెట్‌లో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అన్ని రంగాల్లో యువతను ప్రోత్సహించే విధంగా చూడాలి’ అని వెల్లడించారు. అప్పుడే ప్రధాని కలలు కనే 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించగలం’ అని వెల్లడించారు. 

ఈ బడ్జెట్‌ సమావేశాల్లో రోహన్‌ మహాజన్‌ అనే విద్యార్థి ఆర్థిక శాఖ ప్రతినిధిగా వ్యవహరించారు. ఈ బడ్జెట్‌ కేవలం భారత్‌ ఆర్థికంగా తిరిగి కోలుకోవడమే కాకుండా.. దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని రోహన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు యూత్‌ పార్లమెంటేరియన్లకు మార్గనిర్దేశం చేశారు. దేశ రాజకీయాల్లో యువ గళాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో కార్తికేయ గోయెల్‌ అనే విద్యార్థి ‘జాతీయ యూత్‌ పార్లమెంట్‌’ ను స్థాపించారు. ఎన్‌వైపీఓ వెబ్‌సైట్ nationalyouthparliament.org క్లిక్‌ చేయండి

ఇదీ చదవండి

భారత భూభాగంలోకి చైనా జవాన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని