ట్రాన్స్‌జెండర్‌ను వివాహం చేసుకున్న యువకుడు

తమిళనాడు కల్లకురిచి జిల్లాలో అరుదైన వివాహం జరిగింది. చింతాద్రిపేట్‌కు చెందిన 29 ఏళ్ల మనో అనే యువకుడు.. ట్రాన్స్‌జెండర్ మహిళ రియాను ప్రేమ వివాహం చేసుకున్నాడు.

Updated : 29 Oct 2021 05:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళనాడు కల్లకురిచి జిల్లాలో అరుదైన వివాహం జరిగింది. చింతాద్రిపేట్‌కు చెందిన 29 ఏళ్ల మనో అనే యువకుడు.. ట్రాన్స్‌జెండర్ మహిళ రియాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి వధూవరుల తల్లిదండ్రులు అంగీకరించనప్పటికీ.. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ జంట ఒక్కటయ్యింది. వధూవరులను ఆశీర్వదించేందుకు పెద్ద ఎత్తున ట్రాన్స్‌జెండర్లు వివాహానికి హాజరయ్యారు. అయితే ఈ తరహా వివాహలు కోయంబత్తూర్, తూత్తుకుడి జిల్లాల్లో ఎక్కువగా జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని