యోగా నేపాల్‌లో పుట్టిందన్న కేపీ శర్మ ఓలి

యోగా నేపాల్‌లోనే పుట్టిందంటూ మరో కొత్తవాదనను తెరపైకి తీసుకొచ్చారు ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి. యోగా ప్రపంచానికి పరిచయమైనప్పుడు అసలు భారత్‌ అనే దేశమే లేదని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని

Published : 22 Jun 2021 01:47 IST

కాఠ్‌మాండూ: యోగా నేపాల్‌లోనే పుట్టిందంటూ మరో కొత్తవాదనను తెరపైకి తీసుకొచ్చారు ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి. యోగా ప్రపంచానికి పరిచయమైనప్పుడు అసలు భారత్‌ అనే దేశమే లేదని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం తన అధికారిక నివాసం బలువతార్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఓలి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. యోగాను కనుగొన్న తమ ఋషుల గొప్పతన్నాన్ని ప్రపంచానికి చాటిచెప్పలేకపోయామని పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ విషయంలో సఫలమయ్యారని తెలిపారు. జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించాలంటూ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మోదీ ప్రతిపాదించడంతో యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. కేపీ శర్మ ఓలి గతంలోనూ రాముడి జన్మస్థానమైన అయోధ్యపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని